విమానం సీట్లో బంగారం | Gold Biscuits Seized In Shamshabad Airport | Sakshi
Sakshi News home page

విమానం సీట్లో బంగారం

May 3 2018 1:47 AM | Updated on Sep 4 2018 5:44 PM

Gold Biscuits Seized In Shamshabad Airport - Sakshi

బంగారు బిస్కెట్లు

శంషాబాద్‌ : విమానంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు మంగళవారం అర్ధరాత్రి జెడ్డా నుంచి వచ్చిన ఎయిరిండియా 966 విమానంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఓ సీటు పక్క భాగంలో దాచిన 799 గ్రాముల బరువు కలిగిన నాలుగు బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వీటి విలువ రూ.25,54,880 ఉంటుందని అధికారులు నిర్ధారించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు బంగారం దాచిన ప్రయాణికుల వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement
 
Advertisement
Advertisement