
అతని తండ్రి శ్రీనివాస్ వ్యాపార రంగంలో ఉన్నారు...
సాక్షి, హైదరాబాద్ : క్యాంపస్ సెలక్షన్‌లో తెలంగాణ విద్యార్థిని భారీ ఆఫర్ వరించింది. గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్న అంకరిగారి బోడ రోహన్.. ఏడాదికి రూ.41.6 లక్షల వేతనం గల ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన రోహన్ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు. అతని తండ్రి శ్రీనివాస్ వ్యాపార రంగంలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉద్యోగం పొందడం ఆనందంగా ఉందని రోహన్ అన్నాడు.