
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో శుక్రవారం ఉగ్రవాదులు చొరబడ్డారన్న వార్త కలకలం రేపింది! ఆక్టోపస్ బృందం 46 మందితో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో పాల్గొంది. అన్నారంలోని సరస్వతి, మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీ ప్రాంతాల్లో ఆక్టోపస్‌కు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు. తుపాకులు, బాంబుల మోతతో అన్నారం, మేడిగడ్డ పరిసర పొలాల్లోని రైతులు, ప్రజలు ఉలిక్కిపడ్డారు. అయితే ఇదంతా ఆక్టోపస్ బృందం మాక్‌డ్రిల్ అని తర్వాత తెలుసుకున్న జనం ఊపిరి పీల్చుకున్నారు