విద్యుదాఘాతానికి యువరైతు బలి | former deid due to current shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి యువరైతు బలి

Jul 21 2015 9:32 AM | Updated on Sep 3 2017 5:54 AM

విద్యుదాఘాతంలో ఓ రైతు పొలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

జగిత్యాల రూరల్: విద్యుదాఘాతంలో ఓ రైతు పొలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల రూరల్ మండలం పెరకపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. రవి (22) అనే రైతు ఉదయం పొలానికి వెళ్లి నీరు పెట్టేందుకు మోటార్ ఆన్ చేయగా విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు. పక్క పొలంలోని రైతులు వచ్చి చూసేసరికి అతను చనిపోయాడు. చేతికి అందిన కొడుకు మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement