ప్రమాదవశాత్తు వ్యవసాయ పొలాల్లో నిప్పంటుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
వ్యవసాయ పొలాల్లో మంటలు
Feb 27 2017 10:29 AM | Updated on Jun 4 2019 5:04 PM
► ఫైరింజన్‌లు చేరుకున్నాకే మంటలు అదుపు
షాబాద్: ప్రమాదవశాత్తు వ్యవసాయ పొలాల్లో నిప్పంటుకున్న సంఘటన మండలంలోని కుమ్మరిగూడ– నరెడ్లగూడ గ్రామాల సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐలు మోహన్‌రెడ్డి, రవికుమార్‌ల వివరాల ప్రకారం కుమ్మరిగూడ సమీపంలోని ఫ్రెష్ కో వ్యవసాక క్షేత్రం వద్ద ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు షాబాద్ పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా మంటలు అధికమవ్వడంతో చేవెళ్ల నుంచి రెండు పైరింజన్లు, ఒక మోటర్ ఫైరింజన్‌ను పిలిపించి మంటలార్పారు. మంటలు కుమ్మరిగూడ, నరెడ్లగూడ గ్రామాలతో పాటు షాబాద్ గ్రామ సమీపంలోకి చేరుకోవడంతో ద్విచక్ర వాహనం పైరింజన్‌పై వెళ్లి మంటలార్పారు. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Advertisement
Advertisement