భువనగిరిలో అగ్ని ప్రమాదం | fire accident in bhuvanagiri | Sakshi
Sakshi News home page

భువనగిరిలో అగ్ని ప్రమాదం

May 12 2015 5:34 PM | Updated on Sep 5 2018 9:45 PM

నల్లగొండ జిల్లా భువనగిరిలో మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది.

భువనగిరి (నల్లగొండ) : నల్లగొండ జిల్లా భువనగిరిలో మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గంజి మార్కెట్ సమీపంలోని శ్రీ సోమేశ్వర స్వామి పెయింటింగ్ షాపు పూర్తిగా కాలిపోయింది. దాదాపు 20 లక్షల ఆస్తి నష్టం జరిగిందని షాపు యాజమాని వాపోయారు. షాపులోని కెమికల్స్, రంగులు ఇతర మెటీరియల్ పూర్తిగా కాలి బూడిదయ్యింది. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement