జిల్లాలోని చేర్యాలలోని ఓ బ్యాంక్లో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది.
వరంగల్: జిల్లాలోని చేర్యాలలోని ఓ బ్యాంక్లో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బ్యాంకులోని పర్నిచర్, కంప్యూటర్లు పూర్తిగా దగ్ధమైయ్యాయి. పోలీస్ పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది.
బ్యాంకులో నుంచి వస్తున్న మంటలు ఎగసిపడుతుండటంతో పోలీసులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినట్టు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులో తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం.