రైతు బాంధవుడు వైఎస్సార్ | farmers god Ysr | Sakshi
Sakshi News home page

రైతు బాంధవుడు వైఎస్సార్

Sep 2 2015 11:37 PM | Updated on Oct 29 2018 8:31 PM

రైతు బాంధవుడు వైఎస్సార్ - Sakshi

రైతు బాంధవుడు వైఎస్సార్

నిత్యం రైతుల శ్రేయస్సు కోసం తపిస్తూ వారి అభివృద్ధికి పాటుపడాలనే లక్ష్యంతో రుణమాఫీ, ఉచిత విద్యుత్ అందించి వారి

సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి
 
 తిప్పర్తి : నిత్యం రైతుల శ్రేయస్సు కోసం తపిస్తూ వారి అభివృద్ధికి పాటుపడాలనే లక్ష్యంతో రుణమాఫీ, ఉచిత విద్యుత్ అందించి వారి కళ్లల్లో ఆనందాన్ని నింపిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని సీఎల్పీ ఉపనేత , ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనియాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా మండలంలోని సిలారిమియాగూడెం, చెరువుపల్లిలో గ్రామాల్లో బుధవారం నిర్వహించిన వైఎస్ వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా చెరువుపల్లిలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమానికి  ఆయన హాజరై మాట్లాడారు.

రైతులకు రెండు పంటలకు నీరందించేలక్ష్యంతో శ్రీశైల సొరంగమార్గం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు రూ.2వేల  కోట్లను, బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టులకు రూ.700 కోట్లను ప్రకటించిన ఘనత వైఎస్‌ఆర్‌కే దక్కిందన్నారు. రూ.4వేల కోట్లతో సాగర్ ఆధునికీకరణ పనులు చేపట్టి రైతుల పట్ల ఉన్న ప్రేమను చూపించారన్నారు. ఏఎమ్మార్పీ ప్రాజె క్టు ద్వారా కాల్వలను తవ్వించి రైతులకు సాగునీరు అందించారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పాశం రాంరెడ్డి, జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్, డీసీసీబీ డెరైక్టర్ పాశం సంపత్‌రెడ్డి, చింతకుంట్ల రవీందర్‌రెడ్డి, జూకూరు రమేష్, సంకు ధనలక్ష్మి, బాలరాజు, వెంకట్రామిరెడ్డి, పాదూరు శ్రీనివాస్‌రెడ్డి, దాసరి వెంకన్న, ఎంపీటీసీలు లొడంగి వెంకటేశ్వర్లు, కిన్నెర అంజి, భిక్షం, తల్లమల్ల యశోద, కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రహీం, ఉప సర్పంచ్ జానకిరాములు, సుదర్శన్‌రెడ్డి, ఇంజ మూరు వెంకన్న, మర్రి యాదయ్య, సునందారెడ్డి, రాజిరెడ్డి, ప్ర శాంత్, రవి, ముత్తిలింగం, సాగర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement