అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం కొండాపూర్‌లో శుక్రవారం జరిగింది.
తాడ్వాయి: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం కొండాపూర్‌లో శుక్రవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన సిద్దయ్య(48) తనకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పులు ఎక్కువవడంతో.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.