మహబూబ్‌నగర్ జిల్లాలో దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన నీలి రాములు(27)అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పుల భారం ఓ రైతును నిలువెల్లా దహించింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లాలో దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన నీలి రాములు(27)కు రెండెకరాల పొలం ఉంది. అందులో ఏటా పత్తి సాగు చేస్తున్నాడు. ఈ ఏడు పత్తి ఆశాజనకంగా లేకపోవటంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. దీనికి తోడు రూ.లక్ష వరకు అప్పు ఉంది. ఈ నేపథ్యంలో అతడు గురువారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి సమీపంలోనే కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకున్నాడు. అతనిని ఎవరూ గమనించక పోవటంతో తీవ్ర గాయాలతో చనిపోయాడు. రాములుకు భార్య మంజుల, మూడేళ్ల కుమారుడు ఉన్నారు.