హెచ్‌ఐవీ ఉందంటూ తప్పుడు రిపోర్టు

 false report as HIV

ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వాకం

ప్రైవేట్‌ ఆస్పత్రిలో హెచ్‌ఐవీ లేదని నిర్ధారణ

కరీంనగర్‌ రూరల్‌: ఓ గర్భిణికి ప్రభుత్వాసుపత్రిలో హెచ్‌ఐవీ ఉందని రిపోర్టు ఇవ్వడంతో వైద్యులు ప్రసవానికి నిరాకరించారు. దీంతో అదే గర్భిణికి ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా, హెచ్‌ఐవీ లేనట్లు రిపోర్టు వచ్చిన ఉదంతమిది.

కరీంనగర్‌ మండలం చామన్‌పల్లికి చెందిన ఓ యువకుడు తన భార్య గర్భవతి కావ టంతో ఈ నెల 22న ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకొచ్చారు. రక్త పరీక్షలు నిర్వహించిన ల్యాబ్‌ సిబ్బంది ఆమెకు హెచ్‌ఐవీ ఉందంటూ రిపోర్టు ఇచ్చారు. ప్రసవం చేసేందుకు వైద్యురాలు నిరాకరించారు. ఆందోళనకు గురైన భర్త సమీపంలోని మరో రెండు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రక్తపరీక్ష చేయించాడు.

రెండు రిపోర్టుల్లోనూ హెచ్‌ఐవీ లేదని నిర్ధారించుకుని తిరిగి ప్రభుత్వ వైద్యురాలికి చూపించగా తాము చేసిన పరీక్షలే ముఖ్యమన్నారు.  ప్రసవం చేసేందుకు రూ.40 వేలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ప్రతిమ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు రక్తపరీక్షలు నిర్వహించగా హెచ్‌ఐవీ లేదని రిపోర్టు  వచ్చింది. మరుసటిరోజు ఉదయం  ఆమె పాపకు జన్మనిచ్చింది.

డ్యూటీ సిబ్బందికి మెమో
గర్భిణికి హెచ్‌ఐవీ ఉందని రిపోర్టు ఇచ్చిన విషయంపై అందిన ఫిర్యాదు మేరకు సం బంధిత వైద్య సిబ్బందికి మెమో జారీ చేశాను. డాక్టర్‌ అజయ్‌కుమార్‌ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించాం. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం.    –సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుహాసిని

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top