డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువు ముగిసినా పర్లేదు!

Expired Driving Licenses To Remain Valid Till 30th June - Sakshi

జూన్‌ 30 వరకు వెసులుబాటు

సాక్షి, హైదరాబాద్‌: మీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువు ముగి సిందా? రెన్యువల్‌ వీలుపడలేదా? అయినా పర్లేదు. దీనికి సంబంధించి జూన్‌ 30 వరకు వెసులుబాటు కల్పించారు. డ్రైవింగ్‌ లైసెన్సులతోపాటు వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫి కెట్లు, పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు.. ఇలా వాహనాలకు సంబంధించిన పలు రకాల సర్టిఫికెట్ల గడువు ముగిసినవారు, త్వరలో ముగుస్తున్నవారు ఎందరో ఉన్నారు. ఈ విషయం కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి వెళ్లటంతో ఆయన సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. రవాణా శాఖతో ముడిపడిన వివిధ పత్రాలకు సంబంధించి.. ఫిబ్రవరి 1 నుంచి జూన్‌ 30 వరకు గడువు ముగిసిన, ముగుస్తున్న వాటికి సంబంధించిన వాహనదారులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యంత్రాంగం ఎలాం టి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 1 నుంచి జూన్‌ 30 వరకు గడువు ముగిసినవాటిని జూన్‌ 30 తర్వాత రెన్యువల్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top