ఆదిలాబాద్ జిల్లాలో ఎక్సైజ్ దాడులు | excise department officials raids on adilabad district | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ జిల్లాలో ఎక్సైజ్ దాడులు

Jan 20 2016 4:02 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

కోటపల్లి: ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కోటపల్లి మండలం అన్నారం గ్రామ శివార్లలో మద్యం తయారుచేస్తున్నారన్న సమాచారంతో అధికారులు దాడులు జరిపారు. జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో దాడులు జరిపి మూడు వేల క్వింటాళ్ల బెల్లం పానకం ధ్వంసం చేయడంతోపాటు 50 లీటర్ల నాటుసారా సీజ్ చేశారు.  నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిపై కేసులు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement