గొర్ల, కుర్మల సంక్షేమానికి కృషి | Etela Rajender Elections Campaign Karimnagar | Sakshi
Sakshi News home page

గొర్ల, కుర్మల సంక్షేమానికి కృషి

Oct 29 2018 7:42 AM | Updated on Aug 27 2019 4:45 PM

Etela Rajender Elections Campaign Karimnagar - Sakshi

జమ్మికుంటలో నిర్వహించిన ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

జమ్మికుంట(హుజూరాబాద్‌): తెలంగాణ ఉద్యమంలో గొల్ల, కుర్మలు గొర్లు, మేకలను రోడ్లకు అడ్డంగా ఉంచిన చరిత్రను టీఆర్‌ఎస్‌ మర్చిపోలేదని, అధికారంలోకి రాగానే వారి సంక్షేమం కోసం పెద్దపీట వేస్తున్నామని 
ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం రాత్రి జమ్మికుంటలో గొల్ల, కుర్మ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. గొల్ల, కుర్మల సంక్షేమం కోసం రూ.4వేల కోట్లను సబ్సిడీ పై గొర్ల పెంపకానికి రుణాలు ఇచ్చామన్నా రు. గతంలో రుణాలు తీసుకోవాలంటే భూములు, ఇళ్లు కుదపెట్టాల్సి వచ్చేదని, ఇప్పుడా పరిస్థితి లేదని పేర్కొన్నారు. గొర్ల పెంపకంలో తెలంగాణ దేశంలోనే ఆదర్శం గా ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో పిం ఛన్‌కు అర్హత 57 ఏళ్లకు కుదించనున్నట్లు వివరించారు.

వచ్చే ఏడాదిలోగా.. చివరి భూములకూ సాగునీరు అందిస్తామని అన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కరువు కనిపించకుండా చేస్తానని ప్రకటించారు. సభలో గొర్ల కార్పొరేషన్‌ చైర్మన్‌ కన్నవేన రాజ య్య యాదవ్, మాజీ ఎమ్యెల్యే సత్యనారా యణగౌడ్, జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, హు జూరాబాద్‌ జెడ్పీటీసీ మొలుగూరి సరోజన, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొండాల్‌రెడ్డి, తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, కన్నబోయిన శ్రీనివాస్, అంజయ్య, మహిపాల్‌ యాదవ్, మండల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement