రూ.10లక్షలు పరిహారం ఇవ్వాల్సిందే.. | Errabelli Dayakar Rao comments on the cm kcr | Sakshi
Sakshi News home page

రూ.10లక్షలు పరిహారం ఇవ్వాల్సిందే..

Nov 16 2014 4:06 AM | Updated on Nov 6 2018 8:28 PM

రూ.10లక్షలు పరిహారం ఇవ్వాల్సిందే.. - Sakshi

రూ.10లక్షలు పరిహారం ఇవ్వాల్సిందే..

తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని, ఆ మొత్తం ఇచ్చే వరకు వదిలేదిలేదని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

టవర్‌సర్కిల్ : తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని, ఆ మొత్తం ఇచ్చే వరకు వదిలేదిలేదని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీపీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందించేందుకు శనివారం స్థానిక అ న్నమనేని గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రైతులు అధైర్యపడి ఆత్మహత్యలకు పా ల్పడవద్దని, అధికారంలో లేకున్నా అండగా ఉం టామని భరోసాఇచ్చారు.

కేసీఆర్ అసమర్థ, అనుభవం లేని పాలనతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ విషయాన్ని ని రూపించకుంటే ముక్కునేలకు రాస్తామని సవాల్‌చేశారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోవ డం లేదని, వారిని ఆదుకునేందుకే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కలిసి ఎన్టీఆర్ సంక్షేమనిధిని ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులకు రూ.50 వేల కోట్ల సంక్షేమ నిధిని కేటాయించాలని డిమాండ్‌చేశారు. ఇతరపార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంలో ఉన్న శ్రద్ధ పాలనపై లేదన్నారు.

రైతు ఆత్మహత్యలు, గిట్టుబాటు ధరలపై అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతోనే టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చే శారని అన్నారు. రైతులకు గిట్టుబాటుధరలు ఇచ్చినట్లు ప్రభుత్వం నిరూపిస్తే టీడీపీ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని స్పష్టంచేశా రు. డబల్ బెడ్‌రూం, దళితులకు మూడెకరాల భూమి, రుణమాఫీ, ఫీజురీయింబర్స్‌మెంట్ అంతా మోసమన్నారు. మరో ఆరునెలల్లో కేసీఆర్ బండారం బయటపడి ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ రైతులకు అండగా ఉండేందుకు, వారి బాధలను తెలుసుకునేం దుకు బస్సుయాత్ర నిర్వహిస్తే దాన్ని విహారయాత్ర అని మంత్రులు సంబోధించడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ సీఎం కాగానే రైతులు కనబడడం లేదని పేర్కొన్నారు. నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, గజ్వేల్ ఇన్‌చార్జి ప్రతాపరెడ్డి, ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రభత్వంపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు ఉడతాభక్తిగా రైతులకు సాయం చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
 
56 మంది రైతుకుటుంబాలకు చెక్కులు పంపిణీ...
జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న 56మంది రై తుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున రూ. 28 లక్షల చెక్కులను బాధిత రైతు కుటుంబాలకు అందజేశారు. ఇంకా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నట్లు తమకు లేఖలు అందుతున్నాయని,  వాటిని కూడా పరిశీలిస్తామన్నారు. కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు బాధిత రైతు కుటుంబాలతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు వెళ్లారు. కార్యాలయం ముందు కలెక్టర్ బయటకు రావాలం టూ నినాదాలు చేశారు. కలెక్టర్ రాకపోవడంతో ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు పలువురు ముఖ్యనేతలు లోనికి వెళ్లి కలిశారు.

బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వినతిపత్రం సమర్పించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.వి జయరమణారావు, వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు పి.రవీందర్‌రావు, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కర్రు నాగయ్య, సాంబారి ప్రభాకర్‌రావు, ముద్దసాని కశ్యప్‌రెడ్డి, అన్నమనేని నర్సింగరావు, నాయకులు పుట్ట న రేందర్, కళ్యాడపు ఆగయ్య, అప్జల్, దామెర సత్యం, గాజ రమేశ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement