ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు

Election Commitments By Rachaconda Police Commissioner - Sakshi

      రాచకొండ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు 

సాక్షి,మోత్కూరు(తుంగతుర్తి) : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా రాజకీయ ప్రచారం, స్వేచ్ఛగా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాచకొండ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ జి.సుధీర్‌బాబు తెలిపారు. సోమవారం సాయంత్రం మోత్కూరు పోలీస్‌స్టేషన్‌ను భువనగిరి డీసీపీతో కలిసి సందర్శించారు. చౌటుప్పల్‌ ఏసీపీ బాపురెడ్డి, రామన్నపేట సీఐ ఎం.శ్రీనివాస్, స్థానిక ఎస్‌ఐ సీహెచ్‌.హరిప్రసాద్‌లతో ఎన్నికలకు సంసిద్ధత కావడంపై సమీక్షించారు. అనంతరం జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చాలా సున్నితంగా వ్యవహరిం చాలని సూచించారు.  ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక గ్రామాలను గుర్తించి వాటిలో ఎలా వ్యవహరించాలని తమ సిబ్బందికి వివరించినట్లు తెలి పారు. ప్రజలు స్వేచ్ఛ వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ శాఖ అన్నిరకాల బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top