త్రిపురారం వడదెబ్బతో ఎనిమిది మంది మృతి చెందారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో చో టు చేసుకున్న ఘటనల వివరాలు..
త్రిపురారం వడదెబ్బతో ఎనిమిది మంది మృతి చెందారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో చో టు చేసుకున్న ఘటనల వివరాలు.. త్రిపురా రం మండలం పెద్దదేవులపల్లి గ్రామ పంచాయతీ పరిధి నర్లకంటివారిగూడెం గ్రామాని కి చెందిన గుండెబోయిన వెంకన్న(32) కూ లీగా జీవనం సాగిస్తున్నాడు. రెండురోజుల క్రితం పనులకు వెళ్లి అస్వస్థతకు గురయ్యా డు. ఇంటి వద్ద చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
అనంతారంలో వృద్ధుడు
గుండాల : మండలంలోని అనంతారానికి చెందిన నల్ల అబ్బసాయిలు (65) బుధవా రం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి కట్టె లు కొట్టుకుని ఇంటికి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. దాహం వేస్తుందని మంచి నీరుతాగి అక్కడికక్కడే మృతిచెందాడు.
నీర్నెముల గొర్రెల కాపరి..
రామన్నపేట : మండలంలోని నీర్నెముల గ్రామానికి చెందిన ఆవుల అంజయ్య(55) జీవాలను పెంచుతూ జీవనం సాగిస్తున్నా డు. బుధవారం జీవాలను తోలుకుని చెరు వు సమీపంలోని తుంబాయి సమీపంలో మేపుతుండగా ఎండవేడిమికి అస్వస్థతకు గురయ్యాడు. అక్కడే ఉన్న సహచర కాపలాదారులు ఇంటికి తీసుకువచ్చి ప్రథమ చికిత్స అందిస్తుండగానే మృతిచెందాడు. మృతుడికి భార్య,కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గొర్రెలమేకల పెంపకందారుల సంఘం జిల్లా డెరైక్టర్ కల్గూరి మల్లేశం నివాళులర్పించారు.
పెర్కకొండారంలో ఆటోడ్రైవర్..
శాలిగౌరారం: మండలంలోని పెర్కకొం డారానికి చెందిన ఏదుల్ల జితేందర్‌రెడ్డి(45) వృత్తిరిత్యా ట్రాలీ ఆటో నడుపుకుం టూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రోజు వారీగా మంగళవారం ఆటో నడిపి ఇంటికి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. కుటిం బీకులు నకిరేకల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందిన జితేం దర్‌రెడ్డి కొంత నయం కాగా నే రాత్రి ఇం టికి వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం తిరి గి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించేలోపు మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
h.†ర్మలగిరిలో వృద్ధురాలు..
చివ్వెంల : చివ్వెంల మండలం జి.తిర్మలగిరి గ్రామానికి చెందిన పిట్టా రంగమ్మ(75) మంగళవారం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి సాయంత్రం ఇంటికి రాగానే అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం ఇంటికి తీసుకురాగా బుధవారం తెల్లవారుజామును మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కుక్కడంలో యువకుడు
వేములపల్లి : మండలంలోని కుక్కడం గ్రామానికి చెందిన బాలెం రమేష్ (23 ) నాలుగు రోజులుగా కట్టెలు కొట్టేందుకు వెళుతూ మంగళవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. స్థానిక వైద్యుడి వద్ద చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతిచెందాడు. రమేష్ 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తల్లి మరణించింది. నాటి నుంచి రమేష్ బాగోగులను నాయనమ్మ రాములమ్మ చూస్తుంది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న మనువడు మృతితో రాములమ్మ రోదిస్తున్న తీరు కలచివేసింది. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్ అలుగుబెల్లి గోవిందరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు మస్తాన్‌వలీ, శర్మ, మహేష్, రాబర్టులు కోరారు.
బెట్టెతండాలో..
దామరచర్ల : మండలంలోని వాచ్యాతండా గ్రామ పంచాయతీ పరిధి బెట్టెతండాకు చెందిన లావూరి మేత్యా(51) పొలం పనులకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇంటి వద్దనే చికిత్స పొందుతూ మృతిచెం దినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
గొట్టిపర్తిలో సహకార బ్యాంక్ వైస్ చైర్మన్..
తుంగతుర్తి : తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన సహకార బ్యాంక్ వైస్‌చైర్మన్ కేతిరెడ్డి విజయ్‌పాల్‌రెడ్డి (63) ఇటీవల వీస్తున్న వడగాల్పులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇంటి వద్దనే చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఆయనకు కుమారుడు కుతురు, భార్య ఉన్నారు. సొసైటి చైర్మన్ గుడిపాటి వెంకటరమణ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి గుడిపాటి నర్సయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెవిటి వెంకన్న, డెరైక్టర్స్ మేనేని మాధవరావు, కుశలవ రెడ్డి, రామలింగం, రామవల్లయ్య, సోమయ్య, లలిత, సీఈఓ వెంకటేశ్వర్, యాధగిరి, ఉపేందర్, తదితరులు సంతాపం తెలిపారు.