
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రముఖ హోటల్‌కు వెళ్లి.. ఓ కస్టమర్ వెజిటేరియన్ బిర్యానీకి ఆర్డర్ ఇచ్చాడు. తీరా.. సర్వర్ తీసుకొచ్చి వడ్డించిన వెజ్ బిర్యానీలో కోడిగుడ్డ దర్శనమివ్వడంతో అతను అవాక్కయ్యాడు. ఇదెక్కడి చోద్యమని హోటల్ నిర్వాహకులను నిలదీశాడు. దీంతో అతన్ని హోటల్ సిబ్బంది బలవంతంగా బయటకు గెంటేశారు.
ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న ప్యారడైజ్ హోటల్‌లో ఈ ఘటన జరిగింది. ఓ కస్టమర్ ఆర్డర్ చేసిన శాఖాహారంలో కోడి గుడ్డు ప్రత్యక్షం కావడంతో.. ఆయన ఇదేమిటని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన హోటల్ సిబ్బంది అతనిపై దౌర్జన్యానికి దిగారు. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. దిక్కున్నచోట చెప్పుకో అంటూ బెదిరించి కస్టమర్‌ను బయటకు గెంటేశారు సిబ్బంది.