బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు

EC Nagireddy Held Video Conference With District Collectors SPs And Officials - Sakshi

సాక్షి, హైదరాబాద్: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షలో చర్చించారు. మున్పిపల్ ఎన్నికలకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. పోలింగ్ రిటర్నింగ్ అధికారులకు మరోసారి శిక్షణ ఇవ్వాలన్నారు. పెరిగిన ఓటర్ల నేపథ్యంలో కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు ఈసీ నాగిరెడ్డి చెప్పారు.

మొత్తం సుమారు 53 లక్షల మంది ఓటర్లున్నారని తెలిపారు. బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ తరువాతనే బ్యాలెట్ పేపర్‌లు ప్రింటింగ్‌కు ఇస్తామని చెప్పారు. రాజకీయ పార్టీలతో రేపు ఉదయం 11.30 గంటలకు సమావేశం కానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, పురపాలక శాఖ ఎండీ శ్రీదేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top