
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడ్రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, కోస్తా ఆంధ్రా, రాయలసీమల్లోనూ మూడ్రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.