మద్యం తాగి నడిపితే జైలుకే

Drinking liquor and drive..go to prison - Sakshi

ట్రాఫిక్‌ ఏసీపీ వెంకటరమణ

మంచిర్యాల క్రైం: మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సిందేనని ట్రాఫిక్‌ ఏసీపీ వెంకటరమణ అన్నారు. మంచిర్యాల పట్టణంలోని ఎఫ్‌సీఏ ఫంక్షన్‌హాల్‌లో గురువారం డ్రంక్‌అండ్‌డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు, వారి కుటుంబం సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపడం  వల్లనే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతన్నాయన్నారు.  ప్రమాదాల్లో మృతి చెందినవారు ఎక్కువశాతం తలకు బలమైన గాయాలు తగలడం వల్లనేనన్నారు.

తలకు హెల్మెట్‌ వాడటం వల్ల రక్షణగా ఉంటుందని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపిన వారు విధిగా హెల్మెట్‌ ధరించాలని, కార్లు నడిపే వారు సీటు బెల్టు తప్పనిసరి ధరించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ రెండు సార్లు పట్టుబడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. మూడోసారి దొరికితే లైసెన్స్‌ రద్దు చేసేందుకు ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ సీఐ సతీశ్, ఎస్సై, ఏఎస్సై భవానీ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top