ఓటేస్తూ.. నో సెల్ఫీ | Don't Take Selfies Near Poling Centers | Sakshi
Sakshi News home page

ఓటేస్తూ.. నో సెల్ఫీ

Nov 22 2018 3:07 PM | Updated on Nov 22 2018 3:07 PM

Don't Take Selfies Near Poling Centers - Sakshi

సాక్షి, ఖమ్మంసహకారనగర్‌:  పోలింగ్‌ సమయంలో ఓటు వేయటానికి వచ్చిన ఓటర్లు తన ఓటును వేస్తూ సెల్‌ఫోన్‌లో సెల్ఫీలు దిగటం, ఇతరులకు చూపించటం చట్ట విరుద్ధం. ఒక వేళ చూపిస్తే రూల్‌ 49ఎం(ఓటు రహస్యం) చట్టం మేరకు ఎన్నికల అధికారులు గుర్తించి ఓటరును బయటకు పంపిస్తారు. ఆ ఓటును 17–ఏలో నమోదు చేస్తారు. లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు. రూల్‌ నంబర్‌ 49ఎన్‌ ప్రకారం అంధులైన ఓటర్లు తాము ఓటు వేయటానికి 18 సంవత్సరాలు దాటిన సహాయకుడిని వెంట తీసుకొని వెళ్ళవచ్చు. సహాయకుడు అతని ఓటును బహిర్గతం చేయనని నిబంధన 10లో ధ్రువీకరించాల్సి ఉంటుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement