ఆపరేషన్‌ థియేటర్‌లో ‘టిక్‌టాక్‌’ 

Doctors Did TikTok Video in Operation Theater Became Viral - Sakshi

సోషల్‌ మీడియాలో వైరల్‌..

హుజూరాబాద్‌: ప్రభుత్వ ఆస్పత్రి ఆపరేషన్‌ థియేటర్‌లో వైద్యులు టిక్‌టాక్‌ చేసిన వీడియో ఒకటి ఆదివారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్‌ థియేటర్‌లో ఓ రోగికి వైద్యులు, సిబ్బంది ఆపరేషన్‌ చేస్తుండగా ‘సార్‌ మేము ప్లేయర్సే.. ఈ ఫుట్‌బాల్‌ ఆట మాకు తెలియదు. కానీ.. మా ఆట దడ.. దడ పుట్టిస్తది’అని ఓ సినిమాలోని డైలాగ్‌తో ఈ వీడియో ఉంది.

అయితే ఈ వీడియోతో తమకేం సంబంధం లేదని హుజూరాబాద్‌ ప్రభుత్వాసుపత్రి ఆర్‌ఎంఓ శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కొన్ని అరుదైన శస్త్ర చికిత్సలు, ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే తాము వీడియో, ఫొటోలు తీసి రోగి బంధువులకు చూపిస్తామని, అయి తే ఈ వీడియో విషయంలో మామూలుగా తీసిన వీడియోను ఎవరో ఎడిట్‌ చేసి టిక్‌టాక్‌లో పెట్టారన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవచ్చన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top