వైద్యుడు.. మరో దేవుడు | doctor is another god | Sakshi
Sakshi News home page

వైద్యుడు.. మరో దేవుడు

Sep 13 2014 2:40 AM | Updated on Oct 9 2018 7:52 PM

వైద్య వృత్తి ఎంతో గొప్పదని, మనిషి ప్రాణాలు కాపాడే వైద్యుడు మరో దేవుడితో సమానమని జిల్లా పరిషత్ చై ర్మన్ బండారి భాస్కర్ అన్నారు.

ఎస్వీఎస్ పాథాలజీ సదస్సులో జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్
పాలమూరు : వైద్య వృత్తి ఎంతో గొప్పదని, మనిషి ప్రాణాలు కాపాడే వైద్యుడు మరో దేవుడితో సమానమని జిల్లా పరిషత్ చై ర్మన్ బండారి భాస్కర్ అన్నారు. ఎస్వీఎస్ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో పాథాలజీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన వార్షిక సదస్సును ఆయన జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సం దర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ వైద్యులు బాధ్యతాయుతంగా వ్యవహరిం చాలని, ఎవరైనా అనారోగ్యంతో వస్తే త మ పరిధిలోది కాదంటూ పట్టణాల్లోని ఆ సుపత్రులకు పంపడం మానుకోవాలని కోరారు. కనీసం ప్రథమ చికిత్సనైనా నిర్వహించి, రోగికి ధైర్యాన్ని నింపి పంపాలన్నారు.

కేవలం డబ్బే ప్రధానంగా కొం దరు వైద్యులు వ్యవహరిస్తున్నారని, వ్య క్తుల ప్రాణాలు కాపాడాల్సిన ఉన్నతమైన బాధ్యత మీదేనన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. డాక్టర్లంతా పట్టణ ప్రాంతాలకు పరిమితం అవుతున్నారని, దీంతో పల్లె ప్రజలకు వైద్యం కరువైందన్నారు. అనంతరం ఎస్వీఎస్ మెడికల్ కళాశాల, ఆసుపత్రి డెరైక్టర్‌లు కేజే.రెడ్డి, కనకరాజులు పాథాలజీ విభాగంలో సాధించిన పురోగతిని వివరించారు. వేలాది వైద్య వి ద్యార్థులకు బోధనచేసి వారి ఉన్నతికి కారణమైన ప్రొఫెసర్లు డాక్టర్ సువర్ణకుమారి, డాక్టర్ ఐ.వి.రేణుకాదేవి, డాక్టర్ సి.పద్మావతి దేవిలను యాజమాన్యం ఆధ్వర్యంలో మెడల్స్ బహుకరించి సత్కరించారు. అ నంతరం సావనీర్‌ను ఆవిష్కరించారు. కా ర్యక్రమంలో ఐఏపీఎం రాష్ట్ర అధ్యక్షురాలు ఐ.వి.రేణుకాదేవి, మున్సిపల్ ఛైర్మన్ రాధా అమర్, కౌన్సిలర్ వనజ, ఎస్వీఎస్ మెడిక ల్ కళాశాల రెసిడెంట్ డెరైక్టర్ రాంరెడ్డి, డీన్ రామేశ్వరుడు, ప్రిన్సిపల్ ఆనంద రామారావు, ఐఏపీఎం ప్రతినిధులు డాక్టర్ అనునయి, డాక్టర్ నిత్యానంద పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement