ప్రణాళికాబద్ధంగా పంపకాలు | Sakshi
Sakshi News home page

ప్రణాళికాబద్ధంగా పంపకాలు

Published Thu, Dec 18 2014 3:53 AM

ప్రణాళికాబద్ధంగా పంపకాలు - Sakshi

ముగిసిన డీపీసీ ఎన్నికల ప్రక్రియ
⇒ గ్రామీణ స్థానాలు ఏకగ్రీవం
⇒పట్టణ సీట్లకు తప్పని పోటీ
⇒మూడు స్థానాలకు ఓటింగ్
⇒విజేతలను ప్రకటించిన సీఈఓ

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా ప్రణాళిక కమిటీ(డీపీసీ) సభ్యుల ఎన్నికల క్రతువు ముగిసింది. పార్టీల పరస్పర అంగీకారంతో గ్రామీణ స్థానాలు(జిల్లా పరిషత్) ఏకగ్రీవం కాగా, మూడు పట్టణ స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. జిల్లా పరిషత్‌లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగగా, ఆ తర్వాత ఓట్లను లెక్కించారు. మూడు సీట్లకు ఐదుగురు బరిలో ఉండడంతో మొదటి వరుసలో నిలిచిన ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు. జిల్లాలోని బడంగ్‌పేట, తాండూరు, వికారాబాద్ , పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలకు చెందిన 119 మంది కౌన్సిలర్లు ఓట్లు వేయాల్సివుండగా, 18 మంది గైర్హాజరయ్యారు. వీరిలో అధికంగా 15 మంది వికారాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఉన్నారు.
 
‘మంత్రా’ంగం!
తొలిసారి డీపీసీ స్థానాలకు ఎన్నికలను ప్రకటించడంతో జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అన్ని పార్టీల నాయకత్వంతో చర్చించి రాజీమార్గాన్ని పాటించారు. ఈ మేరకు సీట్ల సర్దుబాటు జరిగింది.

ఈ క్రమంలోనే జిల్లా పరిషత్(గ్రామీణ) స్థానాల(10) ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అయితే, పట్టణ నియోజకవర్గాల స్థానాల(14) విషయంలో టీడీపీ, బీజేపీల మధ్య అవగాహన కుదరకపోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. మూడు బీసీ(జనరల్) స్థానాలకు ఐదుగురు పోటీలో ఉండడంతో పోలింగ్ తప్పనిసరైంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ఆనంతరం సీఈఓ చక్రధర్‌రావు ముగ్గురు విజేతలను ప్రకటించారు.
 
డీపీసీ సభ్యులు వీరే..!
గ్రామీణ నియోజకవర్గం: పోలమెళ్ల బాలేష్, జే.కే.శైలజ, పి.సరోజ, కర్నాటి రమేశ్‌గౌడ్, పట్లోళ రాములు, ముచ్చోతు మంజుల, ఎనుగుల జంగారెడ్డి, మంద సంజీవరెడ్డి, చింపుల శైలజ, ముంగి జ్యోతి.
 
పట్టణ నియోజకవర్గం:
  పి. స్వప్న, ఆకుల యాదగిరి, పి.నర్సిములు, యాతం శ్రీశైలంయాదవ్, పూడూరి దమయంతి, బి.సునీత, ఈరంకి వేణుకుమార్‌గౌడ్, పెద్దబావి శ్రీనివాస్‌రెడ్డి, విజయేందర్‌గౌడ్, వినోద్‌కుమార్‌జైన్, అంజలి, అమరావతి, చామ సంపూర్ణరెడ్డి, దేవిడి స్వప్న.

Advertisement
Advertisement