నా వ్యాఖ్యలను వక్రీకరించారు : పోచారం | Distorted my comments: Pocharam | Sakshi
Sakshi News home page

నా వ్యాఖ్యలను వక్రీకరించారు : పోచారం

Nov 9 2014 12:37 AM | Updated on Sep 29 2018 7:10 PM

నా వ్యాఖ్యలను వక్రీకరించారు : పోచారం - Sakshi

నా వ్యాఖ్యలను వక్రీకరించారు : పోచారం

అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం రైతు ఆత్మహత్యలపై తాను మాట్లాడిన మాటలను కొన్ని పత్రికలు వక్రీకరించాయని

నిజామాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం రైతు ఆత్మహత్యలపై తాను మాట్లాడిన మాటలను కొన్ని పత్రికలు వక్రీకరించాయని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శ నివారం నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ కష్టాలకు కారకులు ఎవరో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పేందుకు సిద్ధపడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అడ్డు తగిలారని పేర్కొన్నారు. పంటలు చేతికి రాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న మాట వాస్తవమేనని, దీనిపై కమిటీ వేసి విచారణ జరిపిస్తామని మంత్రి చెప్పారు.

నివేదికలు వచ్చాక రైతు కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. రైతుల ఆత్మహత్యలను నివా రించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే, టీడీపీ ఎమ్మెల్యేలు ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే రైతుల ఆత్మ హత్యలకు కారణమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తాను రైతు కుటుంబానికి చెందినవారమని, వారి బాధలు తమకు తెలుసని అన్నారు. అలాంటిది తాము రైతు లను కించపరిచే విధంగా ఎలా మాట్లాడుతామని ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement