ఈసారికి మినహాయింపునివ్వండి | Deputy Minister appealed to the community on the Textbook of private schools | Sakshi
Sakshi News home page

ఈసారికి మినహాయింపునివ్వండి

May 27 2015 12:57 AM | Updated on Sep 3 2017 2:44 AM

ఈసారికి మినహాయింపునివ్వండి

ఈసారికి మినహాయింపునివ్వండి

ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలు ఇన్నాళ్లు విద్యార్థులకు అందుబాటులో లేనందునే ప్రైవేటు పబ్లిషర్లు ముద్రించిన

పాఠ్యపుస్తకాలపై ఉప ముఖ్యమంత్రికి ప్రైవేటు స్కూళ్ల సంఘం విజ్ఞప్తి
 
హైదరాబాద్: ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలు ఇన్నాళ్లు విద్యార్థులకు అందుబాటులో లేనందునే ప్రైవేటు పబ్లిషర్లు ముద్రించిన పుస్తకాలను ప్రాథమిక పాఠశాలల్లో వినియోగించామని ప్రైవేటు పాఠశాలల సంఘం పేర్కొంది. మంగళవారం సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిశారు. ఇప్పటికే విద్యార్థులు ప్రైవేటు పుస్తకాలను కొనుగోలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలనే వినియోగించాలన్న నిబంధన నుంచి ఈసారికి మినహాయింపునివ్వాలని కోరారు.

ఆ నిబంధన అమలు చేస్తే విద్యార్థుల తల్లిదండ్రులు నష్టపోతారని, మినహాయింపునిస్తే వచ్చే ఏడాది నుంచి పక్కాగా అమలు చేస్తామని పేర్కొన్నారు. కాగా, సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి, కార్యదర్శిగా శేఖర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శేఖర్‌రెడ్డి, కోశాధికారిగా భూపాల్‌రావు, కేంద్ర ప్రతినిధిగా జేఎస్ పరంజ్యోతి, అసోసియేట్ అధ్యక్షులుగా రాజారెడ్డి, రవిశంకర్, నర్సింహగౌడ్, చంద్రన్న, అధికార ప్రతినిధిగా శేషుకుమార్ తదితరులు ఎన్నికయ్యారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement