స్కూలు సెప్టిక్ ట్యాంకులో మృతదేహం | Dead Body Found in a School septic tank | Sakshi
Sakshi News home page

స్కూలు సెప్టిక్ ట్యాంకులో మృతదేహం

Jan 13 2016 1:57 PM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బేగంపేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూలు సెప్టిక్ ట్యాంకులో గుర్తు తెలియని మృతదేహం బయటపడింది.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బేగంపేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూలు సెప్టిక్ ట్యాంకులో గుర్తు తెలియని మృతదేహం బయటపడింది. పాఠశాల వాచ్‌మన్ బుధవారం ఉదయం సెప్టిక్ ట్యాంకు మూత తెరిచి చూడగా దుస్తులు లేని స్థితిలో మృతదేహం కనిపించింది. సుమారు ఇరవై రోజుల క్రితం చంపి అందులో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనిపై నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement