ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయండి

CS SK Joshi Says Establish Nursery in Every Village - Sakshi

అధికారులకు సీఎస్‌ ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: హరితహారంలో భాగంగా ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో నర్సరీలను ఏర్పాటు చేయాలని సీఎస్‌ ఎస్‌.కె.జోషి పంచాయతీ రాజ్, మున్సిపల్‌ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో హరితహారం కార్యక్రమంపై సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థలు, 12751 గ్రామపంచాయతీలలో భూమి గుర్తింపు, అవసరమైన మౌలిక సదుపాయాలు, మొక్కలు తదితర వివరాలను వారంలోగా పంపాలన్నారు. అర్బన్‌ పార్కుల్లో నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ నర్సరీల పర్యవేక్షణకు అర్బన్‌ ఫారెస్ట్రీ, ఎంఏయూడీ ఓఎస్డీ కృష్ణను నోడల్‌ అధికారిగా నియమించినట్లు సీఎస్‌ తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, ముఖ్యకార్యదర్శి వికాస్‌ రాజ్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top