నో చెలా‘మనీ’!

Corona Effect Hyderabad People Use Only Digital Payments - Sakshi

కోవిడ్‌ భయంతో నగదు ముట్టని సిటీజనం

70 శాతం నగదు రహిత లావాదేవీలే..

కోవిడ్‌కు ముందు 50 శాతం మాత్రమే డిజిటల్‌ చెల్లింపులు

అగ్రభాగాన పేటీఎం.. ఆ తర్వాత గూగుల్‌ పే..ఫోన్‌పే తదితరాలు

సాక్షి, సిటీబ్యూరో: కూరగాయలు, పండ్లు..ఇతర నిత్యావసరాలు, ఔషధాలు..ఇలా ఒక్కటేమిటి..అన్నింటి కొనుగోలుకూ ఇప్పుడు గ్రేటర్‌ సిటీజన్లు డిజిటల్‌ బాట పట్టారు. కోవిడ్‌ ఎఫెక్ట్‌తో..అగ్గిపుల్లా..సబ్బు బిల్లా అన్న తేడా లేకుండా మెజార్టీ నగరవాసులు బహిరంగ మార్కెట్‌లో నగదు రహిత లావాదేవీలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కరెన్సీ ఇచ్చిపుచ్చుకుంటే కరోనా పొంచి ఉందన్న భయంతో ఇప్పుడు అందరూ ఇదే బాట పట్టడం విశేషం. పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లెక్కల ప్రకారం నగదు రహిత లావాదేవీల్లో జాతీయస్థాయి సగటు 42 శాతం ఉండగా..నగరంలో కోవిడ్‌ కంటే ముందు (లాక్‌డౌన్‌కు ముందు)సుమారు 50 శాతం నగదు రహిత లావాదేవీలు జరిగేవి. ఇప్పుడు ఏకంగా ఈ చెల్లింపులు 70 శాతానికి చేరుకున్నాయని తాజా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఇప్పటివరకు నగదు రహిత చెల్లింపులు చేయని వారు సైతం ఈ బాట పట్టడం విశేషం. ఇక రోజువారీగా తాము చేసే కొనుగోళ్లకు సంబంధించి పేటీఎం వినియోగించే వారు 35 శాతం మందికాగా..గూగుల్‌ పే 25 శాతం..మరో 10 శాతం మంది ఫోన్‌పే, భీమ్‌ యాప్, అమెజాన్‌ మనీ తదితర డిజిటల్‌ మాధ్యమాలను వినియోగిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కోవిడ్‌ భయమే కారణం...
కరెన్సీ నోట్లతో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనతో పలవురు సిటీజన్లు నగదు రహిత చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు. పలు కిరాణా దుకాణాలు, కూరగాయల దుకాణాలు, రైతు బజార్లు, మిల్క్‌షాపులు, మెడికల్‌ షాపులు ఇలా ఎటు చూసినా నగదు ఇచ్చిపుచ్చుకునే కంటే పేటీఎం, గూగుల్‌ పేకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నోట్ల రద్దు పరిణామం అనంతరం పలు వాణిజ్య ప్రైవేటు బ్యాంకులు నగదు ఉపసంహరణపై ఆంక్షలు విధించడంతో డిజిటల్‌ చెల్లింపులు క్రమంగా పెరిగినట్లు  బ్యాంకింగ్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. నెట్‌ బ్యాంకింగ్‌ వినియోగించే వారితోపాటు బ్యాంకు కార్యాలయాలకు వచ్చే వారు సైతం..నెఫ్ట్, ఆర్టీజీఎస్‌ విధానాల్లో నగదు బదిలీ చేస్తున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, వృద్ధులు, గృహిణులు, విద్యార్థులు చిరువ్యాపారులు అన్న తేడా లేకుండా ఇలాంటి లావాదేవీలు కొనసాగిస్తుండడం గమనార్హం.  

ఏటీఎంలకు తగ్గిన రద్దీ...
‘డిజిటల్‌’ పేమెంట్స్‌ పుణ్యామా అని ఏటీఎం సెంటర్ల వద్ద రద్దీ పడిపోయిందనే చెప్పాలి. వేతనం పడడం ఆలస్యం..ఏటీఎం సెంటర్‌ వద్దకు వెళ్ళి డబ్బులు డ్రా చేసుకునే అత్యవసర పరిస్థితిని డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్స్‌ తప్పించాయనే చెప్పాలి. అత్యవసర పరిస్థితిలో తప్ప డబ్బులు డ్రా చేసేందుకు జనం దాదాపుగా స్వస్తి చెప్పారు. ప్రస్తుతం సిటీలో ఎక్కడ ఏటీఎం సెంటర్‌కు వెళ్ళినా సోషల్‌ డిస్టెన్స్‌ మాట అటుంచితే..ఖాళీగా దర్శనమివ్వడం చూడవచ్చు. డిజిటల్‌ పేమెంట్స్‌ పెరిగాక కొన్ని బ్యాంకులు అయితే ఏటీఎం సెంటర్లను తగ్గించినట్లుగా సమాచారం. కొన్ని ఏటీఎం సెంటర్లయితే పెద్ద నోట్లకే పరిమితమయ్యాయి.

సర్వాంతర్యామిగా మొబైల్‌..
నిన్నమొన్నటి వరకు అవతలి వారి మాటలను వినేందుకే ఉపయోగించిన మొబైల్‌ ఫోన్‌ ఇప్పుడు సర్వాంతర్యామిగా మారిపోయింది. డిజిటల్‌ ప్రపంచంలో ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ ‘అగ్రగామిగా’ నిలిచిపోతుంది. ఒకప్పుడు ఊర్లో వారికి డబ్బు డిపాజిట్‌ చేయాలంటే బ్యాంక్‌కు వెళ్లి చేయాల్సి వచ్చేది. రానురాను బ్యాంక్‌లో సొంత ఖాతాదారులకు మినహా వేరే ఖాతాదారుల అకౌంట్‌ నెంబర్‌కు డబ్బు డిపాజిట్‌ చేసే సేవలకు స్వస్తి చెప్పేశారు. ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి డిపాజిట్‌ మిషన్లను అందుబాటులో ఉంచారు. రానురాను ఈ మిషన్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉండడంతో డిజిటల్‌ లావాదేవీల వైపు ఖాతాదారులు మళ్లారు. ఇదేవిధమైన లావాదేవీలు ఇప్పుడు నిత్యావసరాలకు విస్తరించుకున్నారు. దీంతో వినియోగదారుల బాటే మా బాట అంటూ వ్యాపారులు సైతం డిజిటల్‌ క్యూఆర్‌ కోడ్‌ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటుచేసుకుని డిజిటల్‌ పేమెంట్స్‌కు పచ్చ జెండా ఊపేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

19-01-2021
Jan 19, 2021, 12:57 IST
సాక్షి, ముంబై: ఒకవైపు కరోనా  మహమ్మారి అంతానికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు  సీరం వ్యాక్సిన్‌ తీసుకున్న 24...
19-01-2021
Jan 19, 2021, 08:45 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకాల కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుందో తెలియట్లేదు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణీత...
19-01-2021
Jan 19, 2021, 08:06 IST
బెంగళూరు : వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం రెండు మరణాలు సంభవించడం దేశంలో కలకలం రేపుతోంది. ఒకరు ఉత్తరప్రదేశ్‌లోనూ, మరొకరు కర్ణాటకలోనూ...
19-01-2021
Jan 19, 2021, 03:16 IST
సాక్షి, అమరావతి/ భీమడోలు: హెల్త్‌కేర్‌ వర్కర్లకు నిరంతరాయంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియలో భాగంగా మూడో రోజు రాష్ట్రంలో 14,606...
18-01-2021
Jan 18, 2021, 20:35 IST
సాక్షి,  హైదరాబాద్ : కరోనా వ్యాక్సినేషన్‌ తీసుకున్న వారిలో కొంతమంది అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో వాక్సిన్‌ తీసుకున్న ఏడుగురు ఒళ్లు నొప్పులు,...
18-01-2021
Jan 18, 2021, 15:28 IST
సాక్షి, ముంబై : దేశ వ్యాప్తంగా శనివారం నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. శనివారం మొదటి ఫేజ్‌...
18-01-2021
Jan 18, 2021, 10:54 IST
సాక్షి, లక్నో : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నివారణకుగాను ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లకు వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తరుణంలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో విషాదం చోటు...
18-01-2021
Jan 18, 2021, 05:52 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర జనాభాలో ఏకంగా 20 శాతానికి పైగా...
18-01-2021
Jan 18, 2021, 03:55 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ప్రక్రియ రెండో రోజూ చురుగ్గా కొనసాగింది. ఉదయం 9 గంటలకే వ్యాక్సిన్‌ ప్రక్రియ...
17-01-2021
Jan 17, 2021, 15:07 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్న వేళ, దేశ రాజధాని ఢిల్లీలో వ్యాక్సిన్‌...
17-01-2021
Jan 17, 2021, 13:28 IST
‘మా అన్నయ్య చనిపోయాడు. ఇంక నాకీ లోకంలో ఎవరూ లేరు’ అని  ఓ అమ్మాయి ఏడుస్తుంటే..  ‘అయ్యో.. అలా అనకు.. నీకు నేనున్నా’...
17-01-2021
Jan 17, 2021, 10:13 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనాపై అవగాహన కోసం కేంద్రం ఆదేశాల మేరకు ప్రతి టెలికాం సంస్థ విధిగా వినిపిస్తోన్న కాలర్...
17-01-2021
Jan 17, 2021, 05:49 IST
బీజింగ్‌: బీజింగ్‌ దక్షిణ ప్రాంతంలో కరోనా కేసులు తిరిగి నమోదవుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం కేవలం 5 రోజుల్లోనే 1,500...
17-01-2021
Jan 17, 2021, 05:43 IST
న్యూఢిల్లీ/హైదరాబాద్‌: ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ టీకా మాత్రమే తమకు ఇవ్వాలని ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా(ఆర్‌ఎంఎల్‌) ఆసుపత్రి రెసిడెంట్‌...
17-01-2021
Jan 17, 2021, 05:34 IST
బీజింగ్‌: కరోనా వైరస్‌ జాడలున్న 4,800 ఐస్‌క్రీం బాక్సులను చైనా అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమై ఈ వైరస్‌ ఎక్కడి...
17-01-2021
Jan 17, 2021, 05:22 IST
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్దదయిన కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో శనివారం ప్రారంభమైంది. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది...
17-01-2021
Jan 17, 2021, 05:04 IST
ఓస్లో: కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నార్వేలో తీవ్ర విషాదం మిగిల్చింది. ఇటీవల ఫైజర్‌వ్యాక్సిన్‌ తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి...
17-01-2021
Jan 17, 2021, 04:56 IST
భారత్‌లో ఉత్పత్తి చేసిన టీకాలతో కరోనా మహమ్మారిపై నిర్ణయాత్మక విజయం సాధించడం తథ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం...
17-01-2021
Jan 17, 2021, 03:23 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలి రోజు కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ విజయవంతమైంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు...
16-01-2021
Jan 16, 2021, 19:31 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తొలిరోజు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది. నేడు మొత్తంగా 1,65,714 మంది కరోనా నిరోధక వ్యాక్సిన్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top