త్వరలో శనగ కొనుగోళ్లు ప్రారంభం | Coming Soon Peanut Purchases Begin | Sakshi
Sakshi News home page

త్వరలో శనగ కొనుగోళ్లు ప్రారంభం

Mar 28 2018 12:20 PM | Updated on Mar 28 2018 12:20 PM

Coming Soon Peanut Purchases Begin - Sakshi

మాట్లాడుతున్న మార్క్‌ఫెడ్‌ డీఎం పుల్లయ్య  

జైనథ్‌ : మండలకేంద్రంలోని మార్కెట్‌ యార్డులో త్వరలోనే శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని మార్క్‌ఫెడ్‌ డీఎం పుల్లయ్య, మార్కెటింగ్‌శాఖ ఏడీఎం శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం మార్కెట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కొనుగోలు కేంద్రాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. వేసవికాలం దృష్ట్యా తాగునీరు, నీడకోసం చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన రైతులను న్యాయం జరిగేలా కూపన్లు జారీ చేసి తేదీల వారీగా కొనుగోలు చేపట్టాలన్నారు. దళారులకు అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ సర్సన్‌ లింగారెడ్డి, బేల ఎంపీపీ రఘుకుల్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ తల్లెల చంద్రయ్య, ఏఎంపీ వైఎస్‌ చైర్మన్‌ ఎల్టి భూమారెడ్డి, నాయకులు గంభీర్‌ టాక్రే, పూండ్రు వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ బొల్లెం ప్రభాకర్, ఏఎంసీ కార్యరద్శి శ్రీకాంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ అధికారి వివేక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement