మైనారిటీలకు సీఎం శుభాకాంక్షలు | CM KCR wishes To Minoritys | Sakshi
Sakshi News home page

మైనారిటీలకు సీఎం శుభాకాంక్షలు

Nov 11 2016 12:54 AM | Updated on Aug 14 2018 10:54 AM

మైనారిటీలకు సీఎం శుభాకాంక్షలు - Sakshi

మైనారిటీలకు సీఎం శుభాకాంక్షలు

మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణలోని మైనారిటీలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణలోని మైనారిటీలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 11న మైనారిటీ సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. దేశ లౌకిక స్ఫూర్తిని ప్రపంచ నలుదిశలా చాటేలా అబుల్ కలాం కృషి చేశారని సీఎం అభిప్రాయపడ్డారు. విభిన్న మతాలున్నప్పటికీ దేశంలోని పౌరులందరూ సమాన స్వేచ్ఛ, స్వాతంత్య్రం అనుభవించాలనే రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ గుర్తించాలని కేసీఆర్ కోరారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వినియోగించుకుని మైనారిటీలు సామాజికంగా, ఆర్థికంగా వృద్ధి చెందాలని సీఎం ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీలకు తెలంగాణ రాష్ట్రం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తోందని, దీంతో భావితరం బాగుపడుతుందనే ఆశ ఉందని అన్నారు. రాష్ట్రంలో మైనారిటీలకు తగిన గుర్తింపు, గౌరవం, ప్రోత్సాహం ఉంటుందని ఆయన వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement