గ్రేటర్ మంత్రులతో కేసీఆర్ అత్యవసర భేటీ | cm kcr conducts metting with greatre ministers | Sakshi
Sakshi News home page

గ్రేటర్ మంత్రులతో కేసీఆర్ అత్యవసర భేటీ

Jan 16 2015 12:02 PM | Updated on Sep 4 2018 5:07 PM

జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ అత్యవసరంగా శుక్రవారం భేటీ కానున్నారు.

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం గ్రేటర్ మంత్రులతో అత్యవసరంగా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు గ్రేటర్ హైదరాబాద్ మంత్రులు,  ఇతర ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశం అవుతారు.

 

పార్టీ వ్యూహాలు రచించేందుకు , ఇతర అంశాలపై చర్చించేందుకు ఈ భేటీ నిర్వహించనున్నారు. కాగా ఇటీవల జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూసుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో జీహెచ్ ఎంసీ ఎన్నికలకు కేసీఆర్ పచ్చజెండా ఊపనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement