breaking news
meeting with ministers
-
ఎలా ఎదుర్కొందాం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పలు పాలనా అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మంత్రులందరితో సమావేశమ య్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్కలు శనివారం ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 7:45 నిమిషాల వరకు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. దాదాపు 9గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో అధికారులు, సిబ్బందిని దూరంగా ఉంచిన మంత్రులు అనేక అంశాలపై మనసు విప్పి మాట్లాడుకున్నట్టు సమాచారం. ఈ నెల5న అసెంబ్లీ భేటీ...? బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు, ఇటీవల రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కులగణన గురించి సీఎం, మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ⇒ బీసీ రిజర్వేషన్ల విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేలా ముందుకెళ్లాలని, ఇటీవల చేపట్టిన కులగణన రిపోర్టును కోర్టు ముందుంచి బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఎలాంటి అడ్డంకి లేకుండా చూడాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈనెల 5వ తేదీన అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రం చొరవ తీసుకోవాలని తీర్మానం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ⇒ ఎస్సీల వర్గీకరణ అంశంపై కూడా మంత్రులతో సీఎం చర్చించారని, రాజకీయంగా విమర్శలు రాకుండా వీలున్నంత త్వరగా రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణను అమలు చేయాలని, ఎన్నికల కోడ్ ముగిశాక ఈ విషయంలో ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా మరోమారు⇒ త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా మంత్రులు చర్చించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి గెలుపొందే ప్రణాళికలు రూపొందించే బాధ్యతలు మంత్రులు దామోదర, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్లకు అప్పగించారు. ⇒ తాజాగా వివాదాస్పదమైన పార్టీ ఎమ్మెల్యే డిన్నర్ అంశం కూడా చర్చకు వచ్చిందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలకు ఇబ్బంది కలగకుండా మంత్రులు వ్యవహరించాల్సిన తీరు గురించి సీఎం దిశానిర్దేశం చేశారని, మంత్రులంతా సమష్టిగా పనిచేయాలని, ఒక్కటే మాట.. ఒక్కటే పంథా రీతిలో ఇక ముందు పనిచేయాలనే చర్చ కూడా వచ్చినట్టు సమాచారం. అధిష్టానం జోక్యం? ఇటీవల సోషల్‌మీడియా వేదికగా జరిగిన ఓ వ్యవహారంపై సీఎం, మంత్రులు ప్రత్యేకంగా చర్చించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్లో నిర్వహించిన ఓ పోల్‌లో బీఆర్ఎస్కు అనుకూలంగా ఫలితం రావడం, ఈ హ్యాండిల్ స్క్రీన్‌షాట్‌కు బీఆర్ఎస్ సోషల్‌మీడియా విస్తృతంగా ప్రచారం కల్పించిన నేపథ్యంలో సోషల్ మీడియా విషయంలో అటు పార్టీ, ఇటు ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యవహారంపై మంత్రులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.అయితే, ఈ అంశం పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లిందని, మరోమారు ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఢిల్లీ పెద్దలు రాష్ట్ర పార్టీని ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్‌మీడియా, కాంగ్రెస్ వ్యతిరేక సోషల్‌మీడియాలు చేస్తున్న దు్రష్పచారాన్ని అడ్డుకునేలా కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియాను తయారు చేయాలని, ప్రతి చిన్న అంశంపై చేస్తున్న రాద్ధాంతాన్ని సమర్థవంతంగా అడ్డుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. మీడియాతో మంత్రులు ఏం చెప్పారంటే..సమావేశానంతరం, కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద మీడియాతో మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులు మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రెండు గంటల్లోనే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేశామని, వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని దామోదర రాజనర్సింహ చెప్పారు.కేబినెట్ సబ్‌కమిటీ సూచన మేరకు వన్ మ్యాన్ కమిషన్‌ను నియమించామని, ఈ కమిషన్ త్వరలో రిపోర్ట్ ఇస్తుందని, ఆ రిపోర్ట్‌పై కేబినెట్లో చర్చించి, అసెంబ్లీలో ప్రవేశపెడుతామని వెల్లడించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కులగణన కార్యరూపం దాల్చడానికి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రులు చర్చించామన్నారు. ఈనెల 5వ తేదీన సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ ముందు పెడతామని, తర్వాత సభలో చర్చకు పెట్టడం ద్వారా ప్రజాస్వామిక విధానాన్ని ముందుకు తీసుకుపోతామన్నారు. -
Lok Sabha elections 2024: కొత్త ప్రభుత్వం ఏర్పడుతూనే... 100 రోజుల అజెండా!
న్యూఢిల్లీ: ‘వికసిత్ భారత్: 2047’ దార్శనిక పత్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేధోమథనం నిర్వహించారు. ఆయన ఆదివారం తన సహచర మంత్రులతో సమావేశమయ్యారు. ‘2047 నాటికి వికసిత్ భారత్’ అనే లక్ష్య సాధన కోసం రాబోయే ఐదేళ్లలో అనుసరించాల్సిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా 100 రోజుల అజెండాను మోదీ తెరపైకి తీసుకొచి్చనట్లు సమాచారం. రాబోయే మే నెలలో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 100 రోజుల్లో అమలు చేయాల్సిన అజెండాపై ఆయన చర్చించారు. దీనిపై కొందరు మంత్రులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రివర్గ భేటీలో కొన్ని కీలక అంశాలపై ప్రజంటేషన్ కూడా ఇచి్చనట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందాలని, ఘన విజయమే లక్ష్యంగా పనిచేయాలని సహచర మంత్రులకు మోదీ సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమంతోపాటు దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 370కిపైగా స్థానాలు, ఎన్డీయే 400కుపైగా స్థానాలు గెలుచుకుంటాయని మరోసారి ధీమా వ్యక్తం చేశారు. రోడ్‌మ్యాప్ సిద్ధం ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా ‘వికసిత్ భారత్’ సాధన కోసం రోడ్‌మ్యాప్ సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. ఇందుకోసం గత రెండున్నరేళ్లలో వివిధ స్థాయిల్లో 2,700 సమావేశాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహించినట్లు తెలిపాయి. 20 లక్షల మంది యువతీ యువకుల నుంచి సలహాలు సూచనలు అందినట్లు పేర్కొన్నాయి. ఈ రోడ్‌మ్యాప్ ఆర్థిక వృద్ధి, అభివృద్ధి లక్ష్యాలు, సులభతర జీవనం, సులభతర వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర బ్లూప్రింట్ అని అధికారులు స్పష్టం చేశారు. 10 రోజులు.. 29 కార్యక్రమాలు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాని మోదీ రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. రాబోయే 10 రోజుల్లో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. ఆ సందర్భంగా మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు అనేక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశి్చమ బెంగాల్, జమ్మూకశీ్మర్, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఢిల్లీలో మోదీ పర్యటిస్తారని అధికార వర్గాలు ఆదివారం పేర్కొన్నాయి. మోదీ సోమవారం తెలంగాణలో పర్యటించనున్నారు. -
రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా హస్తిన పర్యటనలో భాగంగా ఆయన మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో పాటు విపక్ష నేతలను కలవనున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యే అవకావం కూడా ఉంది. ఢిల్లీలో పార్టీ ఆఫీస్ కోసం కేంద్రం కేటాయించిన స్థలాన్ని కూడా కేసీఆర్ పరిశీలించనున్నారు. ఒకవైపు హస్తినలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతిస్తూనే పలువురు కేంద్ర మంత్రులను కేసీఆర్ కలవనుండడం ఆసక్తికరంగా మారనుంది. -
గ్రేటర్ మంత్రులతో కేసీఆర్ అత్యవసర భేటీ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం గ్రేటర్ మంత్రులతో అత్యవసరంగా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు గ్రేటర్ హైదరాబాద్ మంత్రులు, ఇతర ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశం అవుతారు. పార్టీ వ్యూహాలు రచించేందుకు , ఇతర అంశాలపై చర్చించేందుకు ఈ భేటీ నిర్వహించనున్నారు. కాగా ఇటీవల జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూసుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో జీహెచ్ ఎంసీ ఎన్నికలకు కేసీఆర్ పచ్చజెండా ఊపనున్నట్లు తెలుస్తోంది.