యాదవులు అభివృద్ధి చెందాలి : సీఎం

CM KCR Assures for Yadav Kurma Welfare - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : యాదవ, కురుమలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థిగా బడుగుల లింగయ్య యాదవ్‌కు అవకాశం ఇచ్చిన సందర్భంగా యాదవ, కురుమ సంఘం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బుధవారం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం యాదవులకు రాజ్యసభ అవకాశం ఇచ్చామని, త్వరలోనే కురుమలకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని సీఎం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 20 మంది గొల్ల, కురుమ నేతలను రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా నియమిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా లింగయ్య యాదవ్‌ను సీఎం అభినందించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, కార్పొరేషన్‌ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top