సివిల్స్ స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల | Civils released the results of the screening test | Sakshi
Sakshi News home page

సివిల్స్ స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల

Nov 29 2014 4:48 AM | Updated on Sep 2 2017 5:17 PM

బీసీ స్టడీ సర్కిళ్లలో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ పొందేందుకు ఈ నెల 16న నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఎ. వాణీప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు.

సాక్షి, హైదరాబాద్: బీసీ స్టడీ సర్కిళ్లలో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ పొందేందుకు ఈ నెల 16న నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఎ. వాణీప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు.

అర్హత పొందిన అభ్యర్థులకు వచ్చే నెల ఒకటి నుంచి శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 100 మందికి విశాఖలో, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన 60 మందికి రాజమండ్రిలో, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన 100 మందికి విజయవాడలో, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాలకు చెందిన 60 మందికి అనంతపురంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో ఈ శిక్షణ ఉంటుందని చెప్పారు.

ఈ శిక్షణా తరగతులను ఆయా జిల్లాల కలెక్టర్లు డిసెంబర్ 1 నుంచి 3లోగా ప్రారంభిస్తారని తెలిపారు. ఇందులో బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు 14 శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందన్నారు. వీరిలోనే 33 శాతం మంది మహిళలు, 3 శాతం మంది వికలాంగులకు రిజర్వేషన్ ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను apbcstudycircles.cgg.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చని వాణీప్రసాద్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement