తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.
మెదక్ : తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. మెదక్ జిల్లా సంగారెడ్డిలో సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులకు సీఐటీయూసీ మెదక్ జిల్లా అధ్యక్షుడు మల్లేశం మద్దతు తెలిపారు. ఆయన శనివారం సంగారెడ్డి డిపో కార్మికులను కలసి వారి సమ్మెకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.