కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వాలు

CITU President K Hemalatha Speaks Over Workers Rights In Telangana - Sakshi

సీఐటీయూ అధ్యక్షురాలు హేమలత

కుషాయిగూడ: కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు కె.హేమలత విమర్శించారు. సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌ (సీఐటీయూ) తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభను శనివారం కుషాయిగూడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ దేశంలో కార్మిక చట్టాలు నీరుగారిపోవడంతో జీవించలేని పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికుల హక్కులను హరిస్తూ కార్పొరేట్లకు పెద్దపీఠ వేశారని మండిపడ్డారు. ఇండస్ట్రియల్‌ కోడ్‌ బిల్లు మూలంగా చట్టసభల్లో కార్మికుల సమస్యలు ప్రస్తావించే అవకాశముండదని, సమ్మెను చట్టవిరుద్ధంగా పరిగణిస్తారని తెలిపారు. ఇక తెలంగాణలో నియంత దొరపాలన సాగుతోందని హేమలత ఆరోపించారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఇటీవలి ఆర్టీసీ కార్మికుల సమ్మేనని చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే జనవరి 8న జరిగే జాతీయ సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top