తెలంగాణలో చైల్డ్‌ ఫ్రెండ్లీ ప్రత్యేక కోర్టు!

Child Frinedly Courts in Teleangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లైంగిక వేధింపులకు గురయిన బాలల కోసం దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు అండగా నిలిచేందుకు ఇప్పటికే ప్రత్యేకంగా భరోసా సెంటర్‌ను ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కిందని, ఈ భరోసా సెంటర్‌లో బాధితులకు కౌన్సెలింగ్‌తోపాటు పునరావాసం కల్పిస్తున్నామని ఆయన శనివారం విలేకరులకు తెలిపారు.

గత రెండేళ్లలో పోక్సో (POCSO) చట్టం కింద బాలలపై నమోదైన వేధింపుల కేసులను భరోసా సెంటర్‌లో పరిష్కరించడం జరిగిందని తెలిపారు. కానీ వేధింపుల బారిన పడే బాలలకు అండగా ఉండేందుకు, వారికి సత్వర న్యాయం కల్పించడానికి ప్రత్యేకంగా చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు ఏర్పాటుచేస్తున్నామని, పోక్సో చట్టం కింద నమోదైన కేసులను ఈ కోర్టు విచారిస్తుందని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top