చంద్రబాబు వల్లే తెలంగాణ సాధ్యమైంది : కాంగ్రెస్‌ నేత | Chandrababu Played Key role in The Formation Of Telangana | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు వల్లే తెలంగాణ’

Nov 18 2018 12:56 PM | Updated on Nov 18 2018 1:06 PM

Chandrababu Played Key role in The Formation Of Telangana  - Sakshi

కంటోన్మెంట్‌ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చొరవతోనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. కంటోన్మెంట్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన శనివారం టీడీపీ, టీజేఎస్‌ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ అనుకూలంగా ఉందని లేఖ ఇవ్వకపోతే తెలంగాణ రాకపోయేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇవ్వడంతో పాటు దమ్ముంటే బిల్లుపెట్టాలని కాంగ్రెస్‌పై ఒత్తిడి చేసినందునే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు. తెలంగాణ ఏర్పాటులో అప్పటి రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ కూడా కీలకపాత్ర పోషించారని, ఆయన నేతృత్వంలో యావత్‌ తెలంగాణ ప్రజలు ఉమ్మడిగా పోరాడారన్నారు. ఈ క్రమంలోనే సోనియగాంధీ హృదయం చలించి తెలంగాణ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement