బాబుకు తగ్గుతున్న ఆదరణ

Chandrababu has been reduced to a popular day by day in that state - Sakshi

అందుకే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: కవిత

 నిజామాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆ రాష్ట్రంలో రోజు రోజుకు ప్రజాదరణ తగ్గుతోందని, అది గమనించి ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతున్నారని ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బుధవారం నిజామాబాద్‌లో ‘ఆస్క్‌ కవిత’ పేరిట ప్రత్యేక రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌తో పాటు, స్థానికులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.

రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఫెడరల్‌ ఫ్రంట్‌తో వైఎస్సార్‌సీపీ జాతీయ స్థాయిలో కలసి పనిచేస్తుందని భావిస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగానే టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారని పేర్కొన్నారు. ఈ విషయమై చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, కేవలం అభద్రతా భావంతోనే అలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఎవరిని ఆదరిస్తే ఎన్నికల్లో వారే విజయం సాధిస్తారని అన్నారు.

అన్ని పార్టీల్లో వారసులు
బీజేపీ, కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీలలో వారసులు ఉన్నారని కవిత పేర్కొన్నారు. తాము తెలంగాణ కోసం సుదీర్ఘంగా ఉద్యమం చేశామ ని, దాంతో తమ కుటుంబం మొత్తం రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు. పనిచేసే వారికే ఎన్నికల్లో ప్రజలు పట్టం గడుతారని చెప్పారు. గాంధీ, అంబేడ్కర్‌లలో ఎవరు గొప్పవారని అడిగిన ప్రశ్నకు.. అంబేడ్కర్‌ అన్నివర్గాల ప్రజల సమానత్వాన్ని కోర గా, గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చి పెట్టారన్నా రు.

ఇద్దరూ గొప్పవారని, కానీ మార్గాలు వేరన్నారు. కేటీఆర్‌ గురించి అభిప్రాయం వ్యక్తం చేయాలని కోరగా తండ్రిగా, రాజకీయవేత్తగా, అన్నగా, భర్తగా సమర్థవంతంగా బాధ్యతలు నెరవేరుస్తున్నారని కితాబిచ్చారు. తన సొంత ఖర్చులతో నిజామాబాద్‌ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేస్తున్నానని, ఈ విధానా న్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో అమలు చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top