తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన | central committe will estimate loss of agriculture | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన

May 25 2015 8:22 AM | Updated on Jun 4 2019 5:04 PM

తెలంగాణలో సోమవారం నుంచి కేంద్ర బృందం పర్యటించనుంది. అకాల వర్షాలకు జరిగిన నష్టంపై పరిశీలన చేయనుంది.

హైదరాబాద్: తెలంగాణలో సోమవారం నుంచి కేంద్ర బృందం పర్యటించనుంది. అకాల వర్షాలకు జరిగిన నష్టంపై పరిశీలన చేయనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి యూకే సింగ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యులు పర్యటిస్తారు. మూడు బృందాలుగా ఆరు జిల్లాల్లో పర్యటించి వీరు పంట నష్టాన్ని అంచనా వేయనున్నారు.

మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలో ఒక బృందం, కరీంనగర్, నిజమాబాద్ జిల్లాకు ఒకటి, నల్లగొండ, వరంగల్ జిల్లాకు మరో బృందం వెళ్లి పర్యటించనుంది. అకాల వర్షాలు, వడగళ్ల వాన కారణంగా రాష్ట్రంలో వ్యవసాయానికి రూ.150 కోట్లు నష్టం వాటిల్లునట్లు కేంద్రానికి ఇప్పటికే తెలంగాణ సర్కార్ నివేదిక సమర్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement