కార్మికుల పొదుపు సొమ్ము ను మింగేసిన ఆర్టీసీ ఎట్టకేలకు ఆ మొత్తాన్ని తిరిగి జమ చేసింది.
ఎట్టకేలకు సిబ్బందికి రుణాలు
హైదరాబాద్: కార్మికుల పొదుపు సొమ్ము ను మింగేసిన ఆర్టీసీ ఎట్టకేలకు ఆ మొత్తాన్ని తిరిగి జమ చేసింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రూ.250 కోట్లు చొప్పున పాత బకాయిలు చెల్లిం చడంతో అందులోంచి రూ.223 కోట్లను కార్మికుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి ఆర్టీసీ యాజమాన్యం జమచేసింది. ఆగస్టు 31 వరకు పెండింగులో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు ఇవి సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. ప్రతినెలా రూ.53 కోట్లను యాజమాన్యం సీసీఎస్‌కు జమచేయాల్సి ఉంటుంది.
ఆ మొత్తం నుంచి కుటుంబావసరాలకు కార్మికులు రుణంగా పొందుతారు. కానీ 5 నెలలుగా వాటి ని జమచేయకుండా ఆర్టీసీ సొంతానికి వాడుకుంది. ఫలితంగా రుణాల కోసం కార్మికులు చేసుకున్న 20 వేల దరఖాస్తులు పేరుకుపోయా యి. ఆగస్టు 31 తర్వాత అందిన దరఖాస్తులు మరో 300 వరకు పెండింగ్‌లో ఉంటాయి.