తెలంగాణ రాజముద్రలో లోపాలున్నాయి
తెలంగాణ రాజముద్ర రూపకల్పనలో నిబంధనను పాటించలేదంటూ శుక్రవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ...
హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజముద్ర రూపకల్పనలో నిబంధనను పాటించలేదంటూ శుక్రవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన టి.ధనగోపాల్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాజముద్ర రూపకర్త ఏలే లక్ష్మణ్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
తెలంగాణ రాజముద్రలో మూడు సింహాల కింద దేవనాగరి లిపిలో ఉండాల్సిన సత్యమేవ జయతే అనే పదాలను మూడు సింహాలకు దూరంగా ఉంచారని, ఇది స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ లోపాన్ని సరిదిద్దకుండానే తెలంగాణ ప్రభుత్వం రాజముద్రకు ఆమోదం తెలిపిందని, అందువల్ల రాజముద్ర లోపాలను వెంటనే సరిదిద్దేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు.