పెళ్లి సామగ్రి కొనుగోలు చేసేందుకు బయల్దేరిన దంపతులు ఆర్టీసీ బస్సులో నగదు, వెండి ఆభరణాలు ఉన్న బ్యాగును ...
మానవత్వం చాటుకున్న యువకుడు
బస్సులో మరిచిపోరుున నగదు, ఆభరణాల బ్యాగు బాధితులకు అప్పగింత
నల్లబెల్లి : పెళ్లి సామగ్రి కొనుగోలు చేసేందుకు బయల్దేరిన దంపతులు ఆర్టీసీ బస్సులో నగదు, వెండి ఆభరణాలు ఉన్న బ్యాగును మరిచిపోరుు రోదిస్తుండగా.. ఆ బస్సును ఓ యువకుడు బైక్‌పై చేజ్ చేసి బ్యాగును తిరిగి తీసుకొచ్చి వారికప్పగించిన సంఘటన మండల కేంద్రంలో గురువారం జరిగింది. వుండలంలోని బోల్లోనిపల్లి గ్రావూనికి చెందిన కోవూండ్ల మొగిళి -రాజేశ్వరి దంపతులు తమ వుూడో కువూర్తె శైలజ పెళ్లి సామగ్రి కొనుగోలు చేసేందుకు ఓ బ్యాగ్‌లో రూ.10 వేలు, 15 తులాల వెండితో నర్సంపేట డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కి నల్లబెల్లికి బయల్దేరారు. వుండల కేంద్రానికి రాగానే వారు బస్సులోనే డబ్బులు, వెండి పెట్టిన బ్యాగ్‌ను వుర్చిపోరుు బస్టాండ్‌లో దిగారు. ఇంతలో బస్సు అక్కడి నుంచి నర్సంపేటవైపు వెళ్లిపోరుుంది.
కొద్ది సవుయుం తర్వాత బ్యాగ్‌ను బస్సులో వుర్చిపోరుునట్లు గవునించిన దంపతులు మొగిళి- రాజేశ్వరి, వారి కువూర్తెలు శైలజ, సువులత విలపించసాగారు. అక్కడే ఉన్న వుండల కేంద్రానికి చెందిన రామిని నాగరాజు విషయుం తెలుసుకొని తన ద్విచక్రవాహనంపై బస్సును వెంబడిం చాడు. చివరికి నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్ లో బస్సును నిలిపివేరుుంచి డ్రైవర్‌కు సవూచారమిచ్చారు. బస్సులో ఉన్న బ్యాగ్‌ను తీసుకె ళ్లి ఆ దంపతులకు నాగరాజు ట్రైనీ ఎస్సై స్వామి సవుక్షంలో అందించారు. దీంతో పోలీసులు నాగరాజును అభినందించారు.