జింకల వేట కేసులో ఎవరినీ వదలొద్దు | bjp request to PCCF on deers hunting | Sakshi
Sakshi News home page

జింకల వేట కేసులో ఎవరినీ వదలొద్దు

Mar 26 2017 2:59 AM | Updated on Mar 29 2019 9:31 PM

జింకల వేట కేసులో ఎవరినీ వదలొద్దు - Sakshi

జింకల వేట కేసులో ఎవరినీ వదలొద్దు

భూపాలపల్లి జిల్లాలో జరిగిన జింకల వేట విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌) పీకే ఝాకు బీజేపీ ఎమ్మెల్యేలు

పీసీసీఎఫ్‌కు బీజేపీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్‌: భూపాలపల్లి జిల్లాలో జరిగిన జింకల వేట విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌) పీకే ఝాకు బీజేపీ ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం పీసీసీఎఫ్‌ కార్యాలయంలో ఝాను వారు కలిశారు. ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని కోరారు.

ఇదే అంశంపై డీజీపీ అనురాగ్‌శర్మను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఫారెస్ట్‌ అధికారులను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసులో తగిన ఆధారాలున్నందున టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీపై చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన మంత్రుల కుమారులను ఎందుకు వదిలిపెట్టారని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement