దిశ ఘటన.. రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ : దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులను ఊరి తీయాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే దిశ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిశ కేసు నిందితులు కోర్టు నుంచి తప్పించుకున్నా, జైలు నుంచి తప్పించుకున్నా, తన నుంచి తప్పించుకోలేరని రాజా సింగ్ హెచ్చరించారు. దిశను ఎంత దారుణంగా హత్య చేశారో.. నలుగురు నిందితులను అదే విధంగా శిక్షిస్తామని చెప్పారు.
కాగా, ఈ కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మహబూబ్‌నగర్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనుంది. మరోవైపు షాద్‌నగర్ కోర్టు దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను వారం రోజులపాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి