మహిళలకు ఇల్లు కట్టించే బాధ్యత నాది

BJP Construct Houses To Poor People - Sakshi

టీయూను జాతీయస్థాయిలో అభివృద్ధి చేస్తాం..

బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): నిజామాబాద్‌ ఎంపీగా గెలుపొందిన తర్వాత నియోజకవర్గంలో ని నిరుపేద మహిళలందరికీ సొంతిల్లు కట్టించే బాధ్యతను తీసుకుంటానని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ హామీనిచ్చారు. శనివారం నిజా మాబాద్‌ రూరల్‌ మండలంలోని మల్లారం, మ ల్కాపూర్, గాంధీనగర్‌లో అర్వింద్‌ ఎన్నికల ప్రచా రాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో యువత పాత్ర చాలా కీలకమైందన్నారు. నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పథకాలను తామే ప్రవేశపెట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. మోదీని గెలిపించి మరోసారి ప్ర ధానమంత్రిని చేయాలని యావత్‌ భారతావని ఎ దురు చూస్తోందని తెలిపారు.

మోదీ ప్రధాని అ యిన వెంటనే 2022 వరకు 5కోట్ల ఇళ్లను మహిళలకు ఇవ్వాలనే ధృడసంకల్పంతో ఉన్నారని పే ర్కొన్నారు. నియోజకవర్గానికి లక్ష ఇళ్లను ఒక్కో ఇల్లుకు రూ.2.50లక్షలు ఇవ్వనున్నారన్నారు. అ లాగే గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులే ఎక్కువగా ఉంటాయని, స్వచ్ఛభారత్‌ మి షన్‌ కింద ఒక్కో లబ్ధిదారుడికి రూ.12వేలతో మ రుగుదొడ్లను నిర్మించి ఇచ్చిందని గుర్తుచేశారు. ఉ చిత గ్యాస్‌ కనెక్షన్లు, కేసీఆర్‌ కిట్లలో రూ.6వేలు, రేషన్‌ బియ్యంలో రూ.29 కేంద్ర ప్రభుత్వానివేన ని, పంచాయతీ భవనాలు, రోడ్లును నిర్మించి ఇ స్తుందన్నారు.

ఉపాధిహామీ పథకం కూడా కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. రూరల్‌ ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి డబ్బులు ఉండవు కానీ జక్రాన్‌పల్లిలో రూ.3వేల కోట్లతో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తారట అని ఎద్దేవాచేశారు. టీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న హా మీ నీటమూటగానే మిగిలిపోయిందన్నారు. నిజా మాబాద్, జగిత్యాల్‌కు చెందిన అనేక మంది యు వత బతుకుదెరువు కోసం గల్ఫ్‌ వెళ్తున్నారని చె ప్పారు. టీయూను జాతీయస్థాయి యూనివర్శిటీగా మారుస్తామని హామీనిచ్చారు.

రైతుల పండిం చిన పంటలకు మద్దతు ధరలతోపాటు పసుపుబో ర్డు తప్పకుండా ఏర్పాటు చేస్తామన్నారు. నిజాంషుగర్స్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ను రాష్ట్రంలో అమలు చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు మల్లా రం గ్రామంలో అర్వింద్‌కు ఘన స్వాగతం పలికా రు. అదేవిధంగా గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహాని కి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈకా ర్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారె డ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ధన్‌పాల్‌ సూర్యనా రాయణ గుప్త, పద్మారెడ్డి, ఆమంద్‌ విజయ్‌ కృష్ణ, బంటు రాము, వినాయక్‌నగర్‌ సుధా, స్థానిక నా యకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

ప్రపంచంలోనే  అగ్రగామి దేశంగా భారత్‌
సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌అర్బన్‌): భారతదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మార్చేందుకు పడుతున్న తపనకు  మనమందరం వారికి బాసట గా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజే పీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి పిలుపుని చ్చారు. శనివారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో జెం డాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా గంగారె డ్డి మాట్లాడుతూ బీజేపీ 20 రాష్ట్రాల్లో, కేంద్రం లో అధికారంలో ఉండటానికి అనేకమంది కార్యకర్తల త్యాగఫలం, శ్రమ అని పేర్కొన్నా రు. రా జ్యాంగ ఫలాలు అట్టడుగు వర్గాల ప్రజలకు అం దించాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ అనేక సం క్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు.

నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అర్వింద్‌ను గెలిపించి మోదీకి కానుకగా ఇవ్వాలని, అందుకోసం ప్రతి కార్యకర్త కష్టపడాలన్నా రు. పార్లమెంట్‌ ఎన్నికల్లో తప్పకుండా బీజేపీకి 300 సీట్లు రావడం ఖాయమని, నిజామాబాద్‌లో కూడా బీజేపీ జెండా ఎగురడం తథ్యమన్నా రు. ఈకార్యక్రమంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి అ ర్వింద్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త, గీతారెడ్డి, నాయకులు యెండ ల సుధాకర్, నాగరాజు, మల్లేష్‌ యాదవ్, వెంకటేష్, న్యాలం రాజు, శ్రీనివాస్‌ శర్మ, ఎల్లప్ప, ఆ కుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top