బైక్ బోల్తా.. అర్చకుడి మృతి | bike accident Priest died | Sakshi
Sakshi News home page

బైక్ బోల్తా.. అర్చకుడి మృతి

Oct 30 2015 11:22 AM | Updated on Sep 3 2017 11:44 AM

వరంగల్ జిల్లాలో బైక్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఓ పూజారి ప్రాణాలు కోల్పోయాడు.

లింగాల ఘన్‌పూర్: వరంగల్ జిల్లాలో బైక్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఓ పూజారి ప్రాణాలు కోల్పోయాడు. లింగాల ఘన్‌పూర్ మండలం కల్లెం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మృతుడు జీడికల్ రామాలయంలో అర్చకునిగా పనిచేసే పవనకుమారాచార్యులుగా గుర్తించారు. పవన్ గురువారం రాత్రి బైక్పై జనగామకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కల్లం వద్ద బైక్ బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement