‘రేపు బీసీ బహిరంగసభ దద్దరిల్లాలి’

BC public meeting should be grand success says Krishnaiah - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన తరగతుల సమగ్రాభివృద్ధిని కోరుతూ ఈ నెల 4న సరూర్‌నగర్‌ స్టేడియంలో తలపెట్టిన బీసీ బహిరంగసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ సభకు 112 బీసీ కులసంఘాలు మద్దతు తెలిపాయని చెప్పారు. బీసీలకు చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. బీసీసభప్లాన్, బీసీ అట్రాసిటీ యాక్ట్‌ లాంటి అంశాలపై సభలో చర్చించి తీర్మానాలు చేస్తామన్నారు. ఈ సమావేశ నిర్ణయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top